వీడియో కోసం క్లిక్ చేయండిhttps://www.youtube.com/watch?v=KpTNn7X-T70
వేసవి లోనే మొక్కజొన్నను విత్తుతారు..జూన్ మాసంలో పంట చేతుకందుతుంది..ఆ తర్వాత వేరుశెనగా. ఆతర్వాత ఎర్రజొన్న పంటను వేస్తారు ఎకరంలో మూడుపంటలను తీసి మంచి లాభాలు ఆర్జిస్తున్నరు ఆగ్రామస్థులు. మొక్కజొన్నను ఇతర రాష్ట్రాలకు ఇక్కడినుంచే తరలిస్తారు..వ్యాపారులు సైతం ఇక్కడి మొక్కజొన్న అంటే మక్కువ చూపుతారు.. అదే నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామం. మొక్కజొన్న పొత్తులపై రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తున్న అంకాపూర్ రైతులపై రైతే రాజు ప్రత్యేక కథనం..
మొక్కజొన్న పొత్తులున్నారు తిందువా.. తిందువా అనే పాటవింటే మనకు గుర్తొచ్చేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నిజామాబాద్ జిల్లా అంకపూర్ గ్రామం. మొక్కజొన్న సాగుకు ఆర్మూర్ డివిజన్ పెట్టిందిపేరు. ఆర్మూర్ తో పాటు నందిపేట్, మాక్లూర్లో మొక్కజొన్న పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఇక మండలంలోని అంకాపూర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అత్యధికంగా ఇక్కడి రైతులే మొక్కజొన్న పంటను సాగు చేస్తుంటారు. మొక్కజొన్న కంకులకు అంకాపూర్ కేరాఫ్ అడ్రస్ అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు.
అంకాపూర్ ప్రాంతం నుంచే మొక్కజొన్న క్రయవిక్రయాలు కొనసాగుతుంటాయి. మొక్కజొన్న పొత్తుల కోసం చిన్నచిన్న వ్యాపారులు, ప్రజలు వాహనాలల్లో వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. ఇక్కడి మార్కెట్ యార్డు నుంచే రైతులు విక్రయాలు చేస్తుంటారు. ముఖ్యంగా అంకాపూర్ మార్కెట్ యార్డ్ నుంచి జిల్లా నలుమూలలకే కాకుండా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తున్నారు.
నిజామాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధానరహదారిపై ఉన్న అంకాపూర్ గురించి తెలియని వారండరు. మొక్కజొన్న కంకుల సీజన్ వచ్చిదంటే.. ప్రధానరహదారికి ఆనుకుని ఉన్న ఈ గ్రామం బస్టాండ్ వద్ద ఎవరైనా ఆగి తీరాల్సిందే. రైతులు మొక్కజొన్న కంకులను రోడ్లకిరువైపులా కుప్పలు పోసి విక్రయిస్తుంటారు. పచ్చివి సైజును బట్టి డజన్ 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకూ ఉంటాయి. కొందరు బొగ్గులపై కాల్చి అమ్ముతుంటారు. బొగ్గులపై కాల్చే సమయంలో వచ్చే సువాసనకే సగం కడుపు నిండిపోతుంది. కాల్చిన కంకిని 10 రూపాయలకు విక్రయిస్తుంటారు. కాల్చిన కంకికి నిమ్మకాయకు ఉప్పుపూసి రుద్ది ఇస్తారు. దాన్ని తిన్నవారెవరైనా వెంటనే ఇంకొకటి కొనకుండా ఉండలేరు. మొక్కజొన్న పంటమీద అధిక లాభాలు వస్తున్నందునే రైతులు ఈ పంటపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు.
ఇక్కడ పండించిన మొక్కజొన్న రైతులకే కాకుండా వ్యాపారులు సైతం వివిధ ప్రాంతాల్లో విక్రయించి మంచి లాభాలను గడిస్తున్నారు..20ఏళ్ల నుండి కొందరు ఇక్కడ మొక్కజొన్న వ్యాపారం నిర్వహిస్తున్నారు..ఇక్కడ కొనుగోలు చేసి మహారాష్ట్ర లోని నాందేడ్, ఔరంగబాద్, ధర్మబాద్ తో పాటు. హైదరాబాద్ జగిత్యాల్, కరీంనగర్, ఆదిలాబాద్. లో విక్రయించి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు..అందుకే అంకపూర్ కు వచ్చి మొక్కజొన్న కొనుగోలు చేస్తామని వ్యాపారులు గర్వంగా చెబుతారు.