క్రియేటివ్ బ్రదర్స్


నల్గొండ క్రియేటివ్ బ్రదర్స్ వీడియో చూడండి


దివేది చిన్న చదువులే కానీ వారిలోని సృజనాత్మకత మాత్రం పెద్ద సైంటిస్ట్ లనే ఔరా అనిపిస్తుంది. ఓ వైపు కరువు పరిస్ధితులు..  మరో వైపు తండ్రి పడుతున్న కష్టం నుంచి పుట్టుకొచ్చింది ఆ అన్నదమ్ముళ్లకు విన్నూత్న ఆలోచన.  ఇంకేముంది ఆలోచనను ఆచరణలో పెట్టారు. అతిచిన్న వయసులోనే పెద్ద సైంటిస్టులనే మించిపోయారు. తక్కువ ఖర్చుతో మినీ ట్రాక్టర్ తయారు చేసి నాన్నకు బహుమతిగా ఇచ్చారు. ఇటు ఖర్చును....తండ్రి పడే కష్టాన్ని తగ్గించారు. నల్గొండ జిల్లా వాడపల్లిలో సైంటిస్టులకు కూడా అంతుపట్టని యువకుల ప్రతిభపై సీవిఆర్ న్యూస్ ప్రత్యేక కధనం.


పుర్రెకో బుద్ది జిహ్వకో ఆలోచన అన్నట్టు ఈ యువకులకొచ్చిన ఆలోచన వారి  తండ్రి జీవితాన్నే మార్చేసింది. నాన్నకు ప్రేమతో అంటూ ఏకంగా మినీ ట్రాక్టర్ నే తయారుచేసి గిఫ్ట్ గా ఇచ్చేశారు. చిన్న వయసులోనే అద్బుత ప్రతిభ కనబరిచిన ఈ అన్నదమ్ముళ్లను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు స్దానికులు. నల్గొండ జిల్లా వాడపల్లి గ్రామానికి చెందిన సైదులు, మంగమ్మలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రవీణ్ కుమార్ డిప్లొమా, రెండో కుమారుడు ప్రశాంత్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. తమకున్న మూడెకరాల పొలం సాగుచేసుకుంటూ తన ఇద్దరు కొడుకులను చదివించుకుంటున్నాడు రైతు సైదులు. అయితే తమ తండ్రి వ్యవసాయ పనుల్లో పడుతున్న కష్టాన్ని చూసి చలించి పోయారు ఈ అన్నదమ్ములిద్దరూ. ఎడ్ల సహాయంతో దుక్కి దున్నకం, ఇంటి వద్ద నుంచి బరువైన ఎరువులు మోయడం చూసి తట్టుకోలేక పోయారు. అంతేకాదు భారమవుతున్న ఆర్దిక పరిస్దితులకు చెక్ పెట్టాలనే ఆలోచనకు పదునుపెట్టారు. ఒక్క నాన్న పడుతున్న కష్టమే కాదు....తమ ప్రతిభ ప్రతి రైతుకు ఉపయోగపడాలనే ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆలోచనను అమల్లో పెట్టారు. ఆరు నెలల పాటు శ్రమించి అనుకున్నది సాదించారు. లక్షా 30 వేల ఖర్చుతో వ్యవసాయ పనులకు అవసరమయ్యే చిన్న ట్రాక్టర్ ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.


మొదటగా ఓ పాత ఆటో ఇంజన్ ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ట్రాక్టర్ విడిబాగాలను కొన్నారు. ఇంజన్ పనితీరుపై వివిద ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. ఇంజన్ సెట్ అయ్యాక బ్యాటరీ, గేర్ బాక్స్, వంటి వాటిని కూడా సేకరించారు. వీటన్నిటితో ట్రాక్టర్ ను ట్రయల్ చేయగా సత్పలితాన్నిచ్చింది. ఈ ట్రాక్టర్ ''కొట్టే బ్రదర్స్ ''...అంటే షాట్ కట్ లో కేబీఎస్ 7.5 అని పేరు కూడా పెట్టారు. ఈ మినీ ట్రాక్టర్ కు 5 లీటర్ల డీజిల్ కెపాసిటీ గల ఇంజన్ ఉంది. ఒక లీటర్ తో ఎకరం పొలం అవలీలగా దున్నొచ్చు. పత్తి సాగుకు గుంటుక కూడా కొట్టేలా కూడా తయారు చేశారు. అంతేకాదు పిచికారి కోసం ప్రత్యేకంగా ఓ పరికరం అమర్చేలా చేశారు. ట్రాక్టర్ ట్రాలీలో ఆరు క్వింటాళ్ల బరువు మోసే వీలు కల్పించారు. ఇప్పుడీ మినీ ట్రాక్టర్ తో వ్యవసాయ పనులు అలవోకగా తయారు చేయవచ్చంటున్నాడు ట్రాక్టర్ సృష్టికర్త ప్రవీణ్ కుమార్. రైతులకు ఖర్చుతో పాటు పనిభారం తగ్గుందని చెబుతున్నాడు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే భవిష్యత్ లో మరిన్ని అద్బుతాలు సృష్టిస్తామని ధీమాగా చెబుతున్నాడు.


ఇప్పుడిలాంటి ట్రాక్టర్ దేశంలో మరెక్కడా తయారు కాలేదు. ఒక వేళ ప్రముఖ కంపెనీలు తయారు చేసి మార్కెట్ లో పెడితే రైతులకు పెద్దగా వర్కవుట్ కాదు. ఎందుకంటే కంపెనీల నంచి కొనుగోలు చేయాలంటే ఇలాంటి ట్రాక్టర్ కు  6 నుంచి 8 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ఖర్చును, కష్టాన్ని తగ్గాంచడానికే తాము  సొంతంగా తయారుచేసుకున్నామంటున్నారు కేబీఎస్ బ్రదర్స్. ఇక ఆ నోటా ఆ నోటా మిని ట్రాక్టర్ రూపుదిద్దుకోందన్న సమాచారం రైతులకు తెలియడంతో......ఇలాంటి ట్రాక్టర్ పై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి, ఇదే తరహాలో మినీ ట్రాక్టర్లు తయారుచేసి,  తక్కువ ధరలో సబ్సిడీల ద్వారా అందజేయాలని కోరుతున్నారు రైతులు. ఇక ఈ చిన్న  ట్రాక్టర్ వ్యవసాయ పనుల్లో ఎంతో ప్రయోగకరంగా మారిందని అంటున్నారు రైతు సైదులు. అంతేకాదు  తాను పడుతున్న భాదను చూసి....కన్న బిడ్డలు ట్రాక్టర్ ను సృష్టించడం  తన కెంతో గర్వంగా ఉందని గొప్పగా ఫీలవుతున్నాడు.